Tanuku: తణుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు తగిన సీట్లు కేటాయించాలి!

Tanuku: తణుకు నియోజకవర్గంలో జనసేనకు బలం ఉన్న స్థానాల్లో సీట్లు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు జనసేన సమన్వయకర్తల బృందం వినతిపత్రం అందజేసింది.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 19 Oct 2026 6:43 AM IST
Tanuku
X

Tanuku: తణుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు తగిన సీట్లు కేటాయించాలి!

Tanuku: స్థానిక సంస్థల ఎన్నికల్లో తణుకు నియోజవర్గానికి సంబంధించి జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో తమకు సీట్లు కేటాయించాలని పార్టీ అసెంబ్లీ సమన్వయ కర్త, పార్లమెంట్ నాయకులు డిమాండ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అదేశాల మేరకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కలిసి తమకు బలమున్న ప్రదేశాల్లో సీట్లను కేటాయించాలని కోరారు. కూటమిలో భాగంగా స్పందించి పార్టీ అధిష్టానం మేరకు నిర్ణయం తీసుకుని తణుకులో జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీఇచ్చారు.

కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ నాయకురాలు కాట్నం విశాలి, నియోజక వర్గ ఎన్నికల సమన్వయ కర్తలు అనుకుల రమేష్, పోతుల గంగాధర్, అన్నెం విశ్వ ప్రభు, బలుసు పద్మనాభం, పార్లమెంట్ నిర్వాక్దల్, నాయకులు గన్నాబత్తుల సతీష్, రెల్లు ఠాగూర్, తెలగారెడ్డి లక్ష్మి, ఆకేటి కాశీ, చిక్కాల వేణు, గర్రే తులసి, మొఖమాటం సతీష్, రుద్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)