Bhimavaram: బలుసుమూడి స్కూల్ పిల్లలకు పుస్తకాలు, ఫ్యాన్ల పంపిణీ: జనసేన!

Bhimavaram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భీమవరం బలుసుమూడి ప్రభుత్వ పాఠశాలలో జనసేన నాయకులు విద్యార్థులకు పుస్తకాలు, ఫ్యాన్లు పంపిణీ చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 1 Sept 2026 5:29 PM IST
Bhimavaram
X

Bhimavaram: బలుసుమూడి స్కూల్ పిల్లలకు పుస్తకాలు, ఫ్యాన్ల పంపిణీ: జనసేన!

భీమవరం: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన జరుపుకుంటున్న పుట్టినరోజును పురస్కరించుకుని భీమవరం పట్టణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

​భీమవరం పట్టణ పరిధిలోని బలుసుమూడి వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లతో పాటు పాఠశాల అవసరాల నిమిత్తం ఫ్యాన్లను పంపిణీ చేశారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపడమే తమ నాయకుడికి ఇచ్చే నిజమైన కానుక అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేగేశ్న గణేష్ వర్మ మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జనసేన సైనికులు నిత్యం ప్రజాసేవలో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొని పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story