Velerupadu: జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యులకు ఘన సత్కారం!
Velerupadu: ఏలూరు పార్లమెంట్ పోలవరం నియోజకవర్గ జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యులను వేలేరుపాడు మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
Velerupadu: జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యులకు ఘన సత్కారం!
వేలేరుపాడు: ఏలూరు పార్లమెంటరీలోని పోలవరం నియోజకవర్గం నుండి జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యులుగా నియమితులైన కరాటం సాయి చంద్రమోహన్ (సాయి), అడపా నాగరాజు, గుండుమొగులు సత్య నారాయణ లను వారి నివాసాలకు వెళ్ళి వేలేరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేషుల ఆదినారాయణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేయడంలో సమాచార సేకరణ కమిటీ ముందుంటుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎప్పుడూ గుర్తింపు గుర్తింపు ఉంటుందని అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ ఎదుగుదలకు కృషి చేసినవారిని గుర్తించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళేవారిని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారిని సమాచార కమిటీ సభ్యులుగా ఎంపిక చేసినందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తీసుకోవడం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయన వెంట జనసేన నాయకులు కుక్కునూరు సాయి, గుండారపు శివకృష్ణ, సోషల్ మీడియా ఇంచార్జి కొవ్వాలా క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.




