Jangareddygudem: పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా.. యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం!

Jangareddygudem: కోడిపుంజుల దొంగతనం నెపంతో యువకుడిని కిడ్నాప్ చేసి, తలకిందులుగా వేలాడదీసి కొట్టిన ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Jun 2026 9:21 PM IST
Jangareddygudem
X

Jangareddygudem: పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా.. యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం!

జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట ఎ పోలవరం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని ఎ పోలవరం గ్రామానికి చెందిన అంజిబాబు అనే వ్యక్తి అదే గ్రామంలో పందెం కోడి పుంజులను దొంగిలించాడనే నెపంతో కొంతమంది యువకులు దాడి చేశారు.

తమ్మిలేటి అంజి బాబును కిడ్నాప్ తరహాలో కొంతమంది వ్యక్తులు కారులో తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెం గ్రామ శివారులో తలకిందులుగా వేలాడీ తీసి కొట్టినట్లు ఆరోపణ. బాధితుడు చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదనతో రోడ్డెక్కిన గ్రామస్థులు.

కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తూ అవతల వ్యక్తికి కొమ్ము కాస్తున్నట్లు బంధువులు ఆరోపణ. యువకుడిని కొట్టిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న బంధువులు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story