Jangareddygudem: సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్

Jangareddygudem: జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 30 Jun 2026 8:22 PM IST
Jangareddygudem
X

Jangareddygudem: సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్

Jangareddygudem: జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, కృష్ణ అభిమాని అయిన రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.

విగ్రహాన్ని నత్తా రామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌కు చెందిన శిల్పి కరుణాకర్ ఉడయార్ అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జంగారెడ్డిగూడెం ఏరియా వైడ్ కృష్ణ–మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు భవిరిశెట్టి మురళీకృష్ణ వెల్లడించారు.

సూపర్ స్టార్ కృష్ణకు గత 45 సంవత్సరాలుగా అభిమానిగా కొనసాగుతున్న తాను, ఆ అభిమానానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపై ఉన్న అభిమానాన్ని గౌరవిస్తూ, ఆయనకు అభిమానిగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగాలని ఆకాంక్షిస్తున్నామని, ఇందుకోసం ఆయనను ఆహ్వానించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కృష్ణ–మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అభిమానాన్ని సేవా దృక్పథంతో కొనసాగిస్తున్నామని మురళీకృష్ణ పేర్కొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story