Palakollu: పాలకొల్లులో నామినేషన్ ప్రక్రియ, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన!

Palakollu: పాలకొల్లు మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఏఎస్ఎన్ఎం డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శనివారం పరిశీలించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 14 Nov 2026 8:50 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లులో నామినేషన్ ప్రక్రియ, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన!

పాలకొల్లు: పాలకొల్లు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం ఏ ఎస్ ఎన్ ఎం డిగ్రీ కళాశాల యందు స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి, ఎన్నికల సామగ్రి భద్రతకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మరియు నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU