Polavaram: పోలవరంలో మెగా జాబ్ మేళా.. 105 మందికి ఉద్యోగ పత్రాలు!

Polavaram: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక జాబ్ మేళాకు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జేసీ ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 30 Jun 2026 5:36 PM IST
Polavaram
X

Polavaram: పోలవరంలో మెగా జాబ్ మేళా.. 105 మందికి ఉద్యోగ పత్రాలు!

పోలవరం: చదువుకున్న యువతీ యువకులకు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పనకు మరిన్ని వివిధప్రైవేట్ సెక్టార్లు ముందుకు రావాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పిలుపునిచ్చారు.

మంగళవారం స్థానిక ఐ టి డి ఏ సమావేశపు హాల్లో 16 ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతి యువకులకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించే విధంగా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్,పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరైనారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న యువతి యువకులకు ప్రైవేట్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్రంలోని వివిధ పెద్ద కంపెనీలతో గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వారు ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని ఆయన అన్నారు.

జిల్లాలోని చదువుకున్న యువతీ యువకులకు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించే విధంగా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ జాబ్ మేళాలో ఎంపిక కాబడిన యువతి యువకులు కష్టపడి పనిచేస్తే మరిన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రాంత యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే విధంగా మంచి పేరు తేవాలని ఆయన అన్నారు.

చదువుకున్న యువత యువకులందరికీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టంగా ఉంటుందని అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా 16 ప్రైవేట్ కంపెనీల ద్వారా సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశ కల్పించే విధంగా ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం ఈరోజు రావడం జరిగిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో కౌసల్య పోర్టర్, నైపుణ్య అభివృద్ధి పోర్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ప్రైవేట్ కంపెనీలలో అర్హులైన యువతి యువకులకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఎక్కడైనా ముందుగా ఏ పనినైనా కష్టపడి పని చేసిన యువతి యువకులకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.

ప్రభుత్వం ద్వారా జిల్లా యంత్రాంగం ఈ ప్రాంత యువతి యువకులకు ప్రైవేట్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు పై ఏమైనా సమస్యలు ఉన్నాయి ఎడల మా దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.

ఈరోజు ప్రైవేట్ సెక్టార్లలో ఎంపిక కాబడిన యువతీ యువకులు మీకు కేటాయించిన ప్రైవేటు ఉద్యోగాలలో బాగా పనిచేసి మరిన్ని ప్రైవేటు కంపెనీలు మన ప్రాంత యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వచ్చే విధంగా మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.

ఈ జాబ్ మేళాలో మొత్తం 256 మంది యువతి యువకులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇందులో 105 మంది యువతి, యువకులకు వివిధ ప్రైవేట్ కంపెనీ సంస్థలు ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 16 ప్రైవేట్ కంపెనీలు రావడం జరిగిందని ఆయన అన్నారు.

నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన ఈ జాబ్ మేళాకు చదువుకున్న యువతి యువకులు ఎక్కువగా రావడం జరిగిందని చదువుకున్న యువతి యువకుల విద్యా అర్హతను బట్టి ప్రైవేటు ఉద్యోగాలు రావడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ జాబ్ మేళాలో ఎంపికైన యువతి యువకులు ఎక్కడ అవకాశాలు వచ్చినా ముందుగా జాయిన్ అవ్వాలని ఆయన అన్నారు.

చాలామంది చదువుకున్న యువతి యువకులు ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దరఖాస్తులు రావడం జరిగిందని ఈ దరఖాస్తులను దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు సంస్థలతో సంప్రదించి నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఈరోజు ఈ ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ జాబ్ మేళలో ఎంపికైన యువతి యువకులు మీ మీ గ్రామాలలో యువతి యువకులు మీ వలె మేము కూడా జాబ్ చేయాలని ఆలోచన రావాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి మురళి, ప్రతినిధులు కళ్యాణి,టీ.ఆనంద్, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు తదితరులు

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story