Amalapuram: ఎస్సీ, ఎస్టీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి..
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది
Amalapuram: ఎస్సీ, ఎస్టీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి..
అమలాపురం : ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు పౌర హక్కుల రక్షణ చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని డాక్టర్. బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆమె అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణ, నమోదైన కేసుల విచారణ పురోగతి, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టాలు వెనుకబడిన వర్గాలకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం ఉండకూడదని, ప్రతి కేసును సున్నితంగా పరిశీలించి కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు.
జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్నందున అఘాయిత్యాలు జరగకుండా ముందస్తు చర్యలుగా ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలీసు, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు సకాలంలో పరిహారం, పునరావాసం, చట్టపరమైన సహాయం అందేలా చూడాలని ఆదేశించారు.
సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలో ప్రస్తుతం 34 అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 23 కేసులు ఎఫ్‌ఐఆర్ దశలో ఉండగా రూ.13.25 లక్షల పరిహారం మంజూరైంది. మరో 11 కేసులు చార్జ్‌షీట్ దశలో ఉండగా రూ.10.50 లక్షల పరిహారం మంజూరు చేశారు.
పెండింగ్ కేసుల్లో రెండు కోర్టు స్టే దశలో, 16 చార్జ్‌షీట్ దశలో, ఆరు కుల ధ్రువీకరణ దశలో, నాలుగు అరెస్టు దశలో, రెండు వైద్య నివేదికల కోసం, మూడు దర్యాప్తు దశలో ఉండగా, ఒక కేసు కోర్టు ఆదేశాల కోసం పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు.
సమావేశంలో నాన్-అఫీషియల్ కమిటీ సభ్యులు రజిని సుదీర్, శ్రీనివాస రాజాలు దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాలకు వార్డెన్ల నియామకం చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమావేశంలో అడ్మిన్ ఎస్పీ మహేంద్ర మత్తె, డీఆర్వో వి. సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి పి. జ్యోతిలక్ష్మి దేవి, ఆర్డీవోలు జి.వి.వి. సత్యనారాయణ,




