Polavaram: రంపచోడవరంలో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పెన్షన్ పంపిణీ

Polavaram: రంపచోడవరం మండలంలోని గోపవరం, పోక్స్ పేట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు.

Prasanna, Rampachodavaram
Published on: 1 July 2026 4:28 PM IST
Polavaram
X

Polavaram: రంపచోడవరంలో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పెన్షన్ పంపిణీ

పోలవరం: రంపచోడవరం రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందనీ పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు.

బుధవారం రంపచోడవరం మండలంలోని గోపవరం, పోక్స్ పేట గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి,సంక్షేమ పథకాల అమలుపై ఆయన అడిగి తీసుకొని పింఛను అందజేశారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి వద్దకే పింఛన్ అందించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

పింఛన్ పంపిణీలో ఎలాంటి జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు,సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.

ప్రతినెల రేషన్ సకాలంలో అందుతున్నది లేనిది ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా పింఛన్ డబ్బులకు లంచాలు అడుగుతున్నది లేనిది ఆయన ఆరా తీశారు. ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వవద్దని మీ వ్యక్తిగత ఖర్చులకు మీ కుటుంబ పోషణ అవసరాల కొరకు ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు

ఓటర్ నమోదు ఇమ్యునరేషన్ బి ఎల్ వో లు మీ ఇండ్లకు వచ్చినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇన్యూమరేషన్ ఫారాలలో మూడు బాక్సులు ఉంటాయని ఆ మూడు బాక్స్లాలలో మీ వ్యక్తిగత వివరాలు అనగా ఆధార్, ఫాస్ ఫోటో, రేషన్ కార్డ్ తదితర సర్టిఫికెట్లు ఓటర్ నమోదు పారాలలో నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు.

ఏమైనా సమస్యలు ఉన్న యెడల సంబంధిత అధికారులకు సంప్రదించాలని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్ వారి వెంట పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ షేక్ షరీప్,డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్.దాసరి రత్నాకరరావు, ఎంపీడీవో ప్రసాద్,డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు,మండల వ్యవసాయ శాఖ అధికారి కె. లక్ష్మణరావు,సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story