Gangavaram: కరాటే అనేది ఒక విలువైన విద్య: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి!
Gangavaram: కరాటే అనేది యుద్ధ కళ మాత్రమే కాదని, ఆత్మరక్షణ, క్రమశిక్షణను నేర్పే విలువైన ఆరోగ్యకరమైన విద్య అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.
Gangavaram: కరాటే అనేది ఒక విలువైన విద్య: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి!
గంగవరం: కరాటే అనేది ఒక విలువైన ఆరోగ్యకరమైన విద్య అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. గంగవరం మండల కేంద్రంలో గల మండల విద్యావనరుల కేంద్రంలో కరాటే గురువులు సూరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం కరాటే గ్రేడింగ్ బెల్ట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అనంతరం సారపు గంగాభవాని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరాటే అనేది ఒక వ్యాయామం మాత్రమే కాదన్నారు. కరాటే ద్వారా ఆత్మ రక్షణ, మంచి వ్యాయామం, మంచి ఆరోగ్యం, మంచి క్రమశిక్షణ అలవాటు అవుతాయ న్నారు. కరాటే ద్వారా ఆత్మ రక్షణ, ఆత్మ విశ్వాసం, శారీరక దృఢత్వం, మంచి ఏకాగ్రత వస్తాయన్నారు. కేవలం కరాటే విద్యను యుద్ధ కళగా కాకుండా ప్రస్తుత సమాజానికి అత్యంత విలువైన ఒక విద్య గా భావించాలన్నారు.
ఇప్పటికే బాలికలు, బాలురకు ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ పాఠశాలలో ఒక కరాటే నేర్పే గురువును నియమించి కరాటే శిక్షణ తరగతులు నిర్వహించే అవకాశం కూడా విస్తృతమయ్యే అవకాశం ఉందన్నారు. కరాటేలో శిక్షణ పొందిన చిన్నారులు చేసిన కరాటే నైపుణ్యాన్ని చూసిన ఆమె ప్రశంసించారు. అలాగే హయాషి హా కరాటే పెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా శిక్షణ పొందిన ఆయా గ్రేడ్ లలో ఉత్తీర్ణులైన 34 మంది చిన్నారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఇంకా మరిన్ని బెల్ట్ లు సాధించాలని సూచించారు. ఆరోగ్యకర సమాజం అత్యంత ఆవశ్యకమని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో గంగవరం జడ్పీటీసీ బేబీరత్నం, మాజీ సర్పంచ్ కలుముల అక్కమ్మ, వైస్ ఎంపీపీ కుంజం గంగా దేవి, యువజన విభాగం నాయకులు దిండి బాబీ @నాగ మహేష్, సీనియర్ పాత్రికేయులు జయకృష్ణ, రమేష్, కరాటే గురువులు సూరిబాబు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తురక లక్ష్మణ రావు, కరాటే శిక్షకులు ఎల్లెం శివ , వల్లి వెంకట రమణ, పులిదిండి ప్రసాద్, పోలిశెట్టి అచ్యుత్, కుండ్లమహంతి స్వామిశివ, ఉపాధ్యాయులు కారం ప్రవీణ్ దొర, కోసు శ్రీనివాస్ దొర, సారపు కృష్ణ మూర్తి, MRC సిబ్బంది కోట్ల మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




