Penumantra: నత్త రామేశ్వరం సర్పంచ్‌గా కరుణాకర్ వడయర్ ఏకగ్రీవ ఎన్నిక

Penumantra: పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం సర్పంచ్‌గా కరుణాకర్ వడయర్ ఏకగ్రీవ ఎన్నిక; నామినేషన్ విరమించుకున్న సిహెచ్.వెంకటేశ్వరరావు, మండలంలో తొలి ఏకగ్రీవం.

E.ABRAHAM, ACHANTA
Published on: 21 Nov 2026 11:24 PM IST
Penumantra
X

Penumantra: నత్త రామేశ్వరం సర్పంచ్‌గా కరుణాకర్ వడయర్ ఏకగ్రీవ ఎన్నిక

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థులుగా కరుణాకర్ వడయర్ మరియు సిహెచ్.వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు.

సిహెచ్.వెంకటేశ్వరరావు తన నామినేషన్ విరమించుకోవడంతో కరుణాకర్ వడయర్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పెనుమంట్ర మండలంలో తొలి ఏకగ్రీవ గ్రామంగా నత్త రామేశ్వరం నిలిచింది.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA