Rampachodavaram: రంపచోడవరంలో జనసేన సమాచార సేకరణ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ నాగబాబు

Rampachodavaram: రంపచోడవరం ఆర్క రిసార్ట్‌లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అధ్యక్షతన జనసేన పార్టీ సమీక్ష. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు దిశానిర్దేశం.

Prasanna, Rampachodavaram
Published on: 4 July 2026 2:07 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరంలో జనసేన సమాచార సేకరణ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ నాగబాబు

రంపచోడవరం: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని ఆర్క రిసార్ట్ లో జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సమావేశం ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం జనసైనికులు, పార్టీ నాయకులు, వీరమహిళలతో విస్తృతంగా సమావేశమై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నియోజకవర్గాల వారీగా సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు సముచిత గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాన్య కార్యకర్త కూడా నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని జనసేన కల్పిస్తోందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన నాయకులు పార్టీ సభ్యత్వ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, పార్టీ మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆధారాలతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story