Kovur: కోవూరులో 939 మందికి పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ!
Kovur: కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 939 మంది రైతులకు పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
Kovur: కోవూరులో 939 మందికి పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ!
Kovur: పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. కోవూరు గ్రామంలో 939 మంది రైతులకు పాసు పుస్తకాలు.రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అనేక ప్రాంతాల్లో రైతుల సొంత భూములు కూడా 22(A) నిషేధిత జాబితాలోకి వెళ్లాయని తెలిపారు.
కోవూరు నియోజకవర్గంలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల కొత్తవంగల్లు సమీప గ్రామాల రైతులు తమ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, సుమారు 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దాదాపు 400 ఎకరాలు 22(A)లోకి వెళ్లిన విషయాన్ని రైతులు తెలిపారని వివరించారు.
ఈ సమస్యను కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ , స్థానిక ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.రీసర్వే ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనమని ప్రశాంతిరెడ్డి




