Narsapuram: శాస్త్రీయ నృత్యంలో అద్భుతంగా రాణిస్తున్న పదోతరగతి విద్యార్దిని

Narsapuram: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పదోతరగతి విద్యార్థిని చెన్నాపరపు ధరణి రత్నసాయి వైష్ణవి కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది.

PRABHU, RAZOLE
Published on: 10 May 2026 11:35 AM IST
Narsapuram
X

Narsapuram: శాస్త్రీయ నృత్యంలో అద్భుతంగా రాణిస్తున్న పదోతరగతి విద్యార్దిని

నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరం మండలం మత్సపురి గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని చెన్నాపరపు ధరణి రత్నసాయి వైష్ణవి ఒక వైపు చదువుతూనే శాస్త్రీయ నృత్యం కూచిపూడి లో అద్భుతంగా రాణిస్తుంది. ఇటీవల వైజాగ్, హైదరాబాద్, కార్తీక మాస ప్రదర్శన, గిన్నిస్ బుక్ ప్రదర్శన, రాజమండ్రి, ఒక ప్రముఖ టీవి చానల్ లోను పలు ప్రదర్శనలు చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఈరోజు కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం లోని వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో భాష్యం స్కూల్ లో పదోతరగతి చదువుతున్న వైష్ణవి నర్సాపురం కి చెందిన కుమారి వలవల అనంతలక్ష్మి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తూ ఒక ప్రక్క చదువులోను మంచి ఫలితాలను సాధిస్తు.. జానపద, శాస్త్రీయ నృత్యంలో ప్రత్యేకత కనబర్చుతోంది. అయోధ్య బాల రాముడు, శివుడు, కృష్ణుడు వంటి పలు పాత్రలతో చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందాయి.తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వరలక్ష్మి ల ప్రోత్సాహం విద్యార్దిని వైష్ణవి కి ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభినందిస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story