Bhimavaram: 9 వైన్ షాపులకు అక్టోబర్ 8న లాటరీ: ఎక్సైజ్ శాఖ!
Bhimavaram: 9 మద్యం దుకాణాల దరఖాస్తు గడువు అక్టోబర్ 6 వరకు పొడిగింపు. అక్టోబర్ 8న కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ఎక్సైజ్ శాఖ ప్రకటన.
Bhimavaram: 9 వైన్ షాపులకు అక్టోబర్ 8న లాటరీ: ఎక్సైజ్ శాఖ!
భీమవరం: భీమవరం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మిగిలివున్న 9 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి అధికారులు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ దుకాణాలకు సెప్టెంబర్ 24, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువును అక్టోబర్ 6, 2026 రాత్రి 11:59 గంటల వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తం కేటాయించనున్న 9 మద్యం దుకాణాల్లో భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 6 షాపులు, భీమవరం రూరల్ మండలం పరిధిలో 3 షాపులు ఉన్నాయి.
వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని పరిశీలించిన అనంతరం, అక్టోబర్ 8, 2026న భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించి షాపులను కేటాయిస్తామని భీమవరం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, SHO జి. బసంతి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పెంచిన గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.




