Achanta: దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
Achanta: ఢిల్లీలో బాలకృష్ణన్ కమిషన్‌కు మాల మహానాడు ఏపీ అధ్యక్షుడు పుష్పరాజ్ వినతిపత్రం. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని ఆచంట నేతల డిమాండ్.
Achanta: దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
ఆచంట: దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈరోజు ఢిల్లీ లో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి అనంతరం ఏపీ భవన్ లో వీడియోతో మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల మనోభావాలను అర్థం చేసుకోకుండా జూన్ 10వ తేదీతో బాలకృష్ణ కమిషన్ ముగిసిందని కార్యాలయం సిబ్బంది చెప్పడం.
చాలా దారుణమని అసలు దేశవ్యాప్తంగా బాలకృష్ణన్ కమిషన్ పర్యటంచకుండా ఎలాంటి నివేదిక ఇస్తారని దళితులు మతం మారినంత మాత్రాన కులం పోదని కుల వివక్ష అంటరానితనం దళితుల మీద దాడులు స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న ఇంకా దళితుల మీద వివక్ష కొనసాగుతుందని అలాంటప్పుడు దళితులు క్రైస్తవులను దళితులుగా గుర్తించకుండా రాజకీయ నాయకులు పబ్బం గడుపుతున్నారని..
ప్రతి ఎన్నికల టప్పుడు దళితు క్రైస్తవులను ఎస్సీ హోదాలో చేరుస్తామని దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు దళిత క్రైస్తవులను అయోమయం గురి చేస్తున్నారని 1950 రాష్ట్రపతి ప్రిడియేషియల్ దొంగ చోటు తీసుకొచ్చిన దాన్ని రద్దుచేసి దేశవ్యాప్తంగా బాలకృష్ణ కమిషన్ పర్యటించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని లేకపోతే రానున్న రోజుల్లో పార్లమెంట్ సమావేశంలో అడ్డుకుంటామని ఢిల్లీలో మీడియా ద్వారా పుష్ప రాజ్ హెచ్చరించారు కార్యక్రమంలో నేతల సాల్మన్ రాజు, కోలాటి ప్రసాదరావు, దాసరి చిరంజీవి, చరణ్, తదితరులు పాల్గొన్నారు




