Penumantra: మార్టేరులో ఘనంగా మహిళా, శిశు సంక్షేమ సిబ్బంది సన్మానం
Penumantra: మార్టేరులో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళా అభినందన సభ. డ్వాక్రా సంఘాలు, సంక్షేమ పథకాలపై సమీక్ష. సిబ్బందికి ఘన సన్మానం.
Penumantra: మార్టేరులో ఘనంగా మహిళా, శిశు సంక్షేమ సిబ్బంది సన్మానం
పెనుమంట్ర: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. మహిళా సంఘాలే ఆర్థిక సాధికారతకు చోదకశక్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులోని శ్రీ వేణుగోపాల ఆడిటోరియంలో శనివారం ఆచంట నియోజకవర్గ స్థాయి మహిళా, శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ-వెలుగు సిబ్బందికి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో అభినందన సభ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ మహిళా శక్తి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు బ్యాంకు రుణాలు అందించి, వారిని ఆర్థికంగా స్వావలంబన సాధించేలా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలపై బ్యాంకులు ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా 98 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని, ఇది మహిళల ఆత్మగౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తోందని అన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పితాని సత్యనారాయణ పేర్కొన్నారు.
సిబ్బందికి ఘన సన్మానం
మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు డీఆర్‌డీఏ-వెలుగు కార్యక్రమాల అమలులో భాగంగా విధి నిర్వహణలో కష్టపడి పనిచేస్తున్న వీవోఏ లు, సీసీలు, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందించారు. మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సిబ్బంది చేస్తున్న కృషిని పితాని ప్రశంసించారు.




