Maruteru: మానవత సేవలు అమోఘం.. మార్టేరులో ఘనంగా డ్రైవర్ల సత్కారం

Maruteru: పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులోని శ్రీ వేణుగోపాల ఫంక్షన్ హాల్ నందు 'మానవత' స్వచ్ఛంద సంస్థ 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 11 Jun 2026 9:32 PM IST
Maruteru
X

Maruteru: మానవత సేవలు అమోఘం.. మార్టేరులో ఘనంగా డ్రైవర్ల సత్కారం

Maruteru: మండలం లోని మార్టేరు గ్రామం లో మానవత స్వచ్ఛంద సంస్థ 2026-27 కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం సాయంత్రం మార్టేరు లోని శ్రీ వేణుగోపాల ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది. పూర్వ అధ్యక్షులు శిరము విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సంస్థ ఆశయాలు, గత సంవత్సరం సంస్థ చేసిన సేవా కార్యక్రమాలు, జమ ఖర్చులు వివరాలను అధ్యక్షులు శిరము విశ్వనాథం, కార్యదర్శి బండి ప్రసాద్, కోశాధికారి అమృతవాక్కుల సత్యనారాయణ సభకు తెలియచేశారు.

అనంతరం అత్తిలి, ఆచంట, పెనుగొండ శాఖల అధ్యక్షులు ప్రసంగించారు. అనంతరం అంబులెన్స్, శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్ డ్రైవర్లు సత్కరించి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. డ్రైవర్ లకు నగదు బహుమతులు అందచేశారు. పూర్వ అధ్యక్షులు కార్యదర్శి, కోశాధికారులను జిల్లా కన్వీనర్ అనాలా ఆదినారాయణ, కొత్త సత్యనారాయణ మూర్తి, రీజినల్ చైర్మన్ బాణాల శ్రీనివాసరావు, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ చిర్ల శ్రీనివాసరెడ్డి సత్కరించారు.

అనంతరం నూతన కార్యవర్గం పడాల రామచంద్ర రెడ్డి (యోగ మాస్టర్) అధ్యక్షులు గా, చదువుల వెంకట నరేంద్ర (హిందీ పండిట్) కార్యదర్శిగా, అమృతవాక్కుల సత్యనారాయణ కోశాధికారిగా, ఇంద్రేశ్వర స్వామీజీ గుప్తా ఉపాధ్యక్షులుగా, చిర్ల వంశీహరనాద్ రెడ్డి సహాయ కార్యదర్శిగా, పడాల సువర్ణ గౌరీ ఈసీ ఎడ్యుకేషన్, దొంగ జయదుర్గారావు ఈసీ అవేర్నెస్, తేతలి అయ్యప్ప రెడ్డి ఈసీ హెల్త్, కర్రి అయ్యప్ప బ్రహ్మారెడ్డి ఈసీ ఎమర్జెన్సీ, డైరెక్టర్లు, అడ్వైజరీ బోర్డు సభ్యులచే అత్తిలి నుండి వచ్చిన జిల్లా కన్వీనర్ అనాలా ఆదినారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమం లో కొత్త కార్యవర్గం ను అభినందిస్తూ కర్రి కృష్ణారెడ్డి (సైకిల్ షాప్) మానవత శాశ్వత సభ్యత్వం 25 వేల రూపాయలు అందచేశారు. మానవత సేవలను గుర్తిస్తూ తమ వంతు సహాయం గా కర్రి వెంకటరెడ్డి (డాక్టర్) వారి తల్లి గారి జ్ఞాపకార్థం 8 వేల రూపాయల విలువ గల వీల్చైర్ అందచేశారు. అంతకు ముందు ముఖ్య అతిథిగా వచ్చిన పెనుగొండ ఎస్వీ కేపీ కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ డాక్టర్ కలిదిండి రామచంద్ర రాజు గారు మాట్లాడుతూ గత కార్యవర్గాల సలహాలు సూచనలతో అనుభవాలతో నూతన కార్యవర్గం మరిన్ని సేవాకార్యక్రమాలు పెంచాలని,

సభ్యత్వాలను పెంచటానికి ప్రయత్నం చేయాలని సూచించారు. పెనుగొండ శాఖ కంటే ఆలయం ఏర్పాటు అయిన పెనుమంట్ర శాఖ అన్ని విభాగాల్లోనూ ముందు ఉందని అన్నారు. సభకు విచ్చేసిన అందరికీ విశ్రాంత పీడీ కర్రి కృష్ణా రెడ్డి బోజనాలు ఏర్పాటు చేశారు. అంతరం డాక్టర్ కలిదిండి రామచంద్ర రాజు md కొత్త సభ్యులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నరేంద్ర రెడ్డి, శివన్నారాయణ, శ్రీనివాసుల మురళీ కృష్ణ, బాణాల శ్రీనివాసరావు, రోబ్బి భాస్కరరావు, పడాల జగన్నాధ రెడ్డి, కొనాల నర్సిరెడ్డి, సత్తి సనత్ రెడ్డి, అల్లం భాస్కర్ రెడ్డి, కవి వ్యాఖ్యాత ఎన్ కె నాగేశ్వరావు మొదలగు వారు పాల్గొన్నారు. విశ్రాంత ఎమ్మార్వో చిర్ల సూర్యనారాయణ రెడ్డి సేవాకార్యక్రమాల వినియోగం కోసం 5 వేల రూపాయలు తక్షణ సహాయం అందచేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story