Maruteru: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గాంధీ జయంతి వేడుకలు

Maruteru: మారుటేరు RARS మరియు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. శ్రీనివాస్ నివాళులర్పించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 2 Oct 2026 10:18 PM IST
Maruteru
X

Maruteru: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గాంధీ జయంతి వేడుకలు

మారుటేరు: మారుటేరు లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు వ్యవసాయ పాలిటెక్నిక్ లలో జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ మరియు ఎ.డి.ఆర్. డా. సి.హెచ్. శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎన్. మల్లికార్జునరావు మరియు ఇతర శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగాహాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మొదటగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మరియు ఎ.డి.ఆర్. డా. సి.హెచ్. శ్రీనివాస్ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ ప్రపంచానికి చాటిన అహింస, సత్యాగ్రహం, నమ్మిన సిద్ధాతం కోసం నిజాయితీగా పోరాడటం వంటి వాటిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, సిబ్బంది మరియు వ్యవసాయ పాలిటెక్నిక్ బోధనా బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA