Achanta: రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ: పాలకొల్లు ఏడీఏ!
Achanta: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం జరిగింది. పాలకొల్లు ఏడీఏ మురళీకృష్ణ రైతులకు ఉచితంగా విషపు ఎరను పంపిణీ చేశారు.
Achanta: రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ: పాలకొల్లు ఏడీఏ!
ఆచంట: బుధవారం ఆచంట మండలంలోని అన్ని గ్రామాలలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగినదని ఆచంట మండల వ్యసాయ అధికారి బి నాగరాజు. తెలిపారు.వల్లూరు గ్రామంలో జరిగిన ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొల్లు ఏడిఏ పి.మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ
పీ. మురళీకృష్ణ మాట్లాడుతూ, బ్రోమో డయోలిన్ ఎలుకల మందు లో 96%నూకలు 2% నూనె మరియు 2% బ్రోమోడయోలిన్ అనే ఎలుకల మందు కలిపిన విషపు యరను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని రైతులందరూ సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎలుకల నిర్మూలన సాధ్యపడుతుందని తెలియజేసినారు.
ఉచితంగా పంపిణీ చేసిన విషపు ఎర ను రైతులు అందరూ కూడా 10 గ్రాములు పొట్లాలుగా చేసుకుని ఎలుక కన్నాల వద్ద ఉంచాలని తెలియజేసినారు. వల్లూరు కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు తోట తాతాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎలుకల మందును రైతులందరూ వినియోగించుకోవాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాళం శ్రీను సొసైటీ అధ్యక్షులు తోట తాతాజీ, గుబ్బల పాపారావు, ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు కూటమి నాయకులు రైతు సంఘం సభ్యులు మరియు రైతు సేవా కేంద్రం ఇన్చార్జులు మరియు గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.




