Palakollu: పాలకొల్లు క్షీరారామంలో వైభవంగా సామూహిక సువాసిని పూజలు!

Palakollu: పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా సామూహిక సువాసిని పూజలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 18 Oct 2026 5:28 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లు క్షీరారామంలో వైభవంగా సామూహిక సువాసిని పూజలు!

Palakollu: పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఆలయ మండపంలో సామూహిక సువాసిని పూజలు నిర్వహించారు. ఈ సువాసిని పూజల్లో ప్రత్యేకంగా సుమారు 108 మంది ముత్తైదువులకు అమ్మవారి స్వరూపంగా భావించి పాధా పూజ మొదలుకొని మాలధారణ వరకు అమ్మవారికే చేసినట్లుగా భావిస్తూ మహిళలు పూజలు చేశారు.పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఆలయ మండపంలో సామూహిక సువాసిని పూజలు నిర్వహించారు. ఈ సువాసిని పూజల్లో ప్రత్యేకంగా సుమారు 108 మంది ముత్తైదువులకు అమ్మవారి స్వరూపంగా భావించి పాధా పూజ మొదలుకొని మాలధారణ వరకు అమ్మవారికే చేసినట్లుగా భావిస్తూ మహిళలు పూజలు చేశారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య విశేషంగా ఈ సువాసిని పూజలను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ కార్య నిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు, సుమారుగా 500 మంది మహిళా భక్తులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU