Tanuku: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా AISB విద్యార్థి యూనియన్ భారీ నిరసన ర్యాలీ!
Tanuku: తణుకులో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా AISB స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో 2 వేల మందికి పైగా విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు భారీ ర్యాలీ.
Tanuku: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా AISB విద్యార్థి యూనియన్ భారీ నిరసన ర్యాలీ!
Tanuku: తణుకులో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ర్యాలీ,డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి చదువుపైనే దృష్టి పెట్టాలంటూ AISB స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకులో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు.
ఆర్ట్స్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ “డ్రగ్స్ వద్దు.. చదువే ముద్దు” అంటూ నినాదాలు చేశారు.
డ్రగ్స్ మాఫియాను అరికట్టి యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Next Story




