Nidadavole: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్!

Nidadavole: నిడదవోలు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా రూ.26 వేల కనీస వేతనం, బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ అక్టోబర్ 5 నుంచి సమ్మె హెచ్చరిక.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 2 Oct 2026 4:56 PM IST
Nidadavole
X

Nidadavole: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్!

నిడదవోలు: నిడదవోలు మండలప్రజా పరిషత్ కార్యాలయం... గత 19 సంవత్సరాలనుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు గా పని చేస్తున్న వారికి కనీస వేతనం 26 వేలు రూ..ఇవ్వాలని డివిజన్. మండల పరిధిలో బదిలీలు కల్పించాలని అర్హత అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు కు పదోన్నతి కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు.

ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం MDO K ఆంజనేయ శర్మ .AVV సత్యనారాయణ గార్లకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈనెల అక్టోబర్ 5వ తేదీ లోపు మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని తెలియజేశారు గత రెండు సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మా సమస్యలు పరిష్కరించాలని అధికారులతో విన్నవించుకుంటున్న సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని పరిస్థితిలో సమ్మెలోకి వెళ్తున్నామని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రామకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE