Tanuku: యుద్ధ క్షేత్రం నుండి సమాజ సేవ వరకు డాక్టర్ వేగేశ్న సత్యనారాయణ!

Tanuku: ణుకు పరిసర ప్రాంతాల్లో ఐదు దశాబ్దాలుగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్ డాక్టర్ వేగేశ్న సత్యనారాయణ రాజు

Kallem Murali, Tanuku (West godavari dist)
Updated on: 1 July 2026 12:36 PM IST
Tanuku
X

Tanuku: యుద్ధ క్షేత్రం నుండి సమాజ సేవ వరకు డాక్టర్ వేగేశ్న సత్యనారాయణ!

తణుకు: వైద్యో నారాయణో హరి.. అంత ప్రాధాన్యం ఉన్న వైద్యవృత్తి ప్రస్తుతం సంపాదన ధ్యేయంగా వ్యాపారంగా మారింది.

అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఓపి ఫీజులు వేలలో వసూళ్లు చేస్తున్న ప్రస్తుత తరుణంలో మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్ డాక్టర్ వేగేశ్న సత్యనారాయణ రాజు గత ఐదు దశాబ్దాలుగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ తణుకు పరిసర ప్రాంతాల్లో పరమ వైద్యుడిగా పేదల మన్ననలు పొందుతున్నారు.

దేశ సేవ అనంతరం.. సమాజ సేవ..

డాక్టర్ సత్యనారాయణ రాజు ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేసి తన 23 ఏట 1971 సంవత్సరంలో ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ లెఫ్ట్నెంట్ గా చేరారు.

ఇదే సమయంలో ఇండో- పాక్ యుద్ధం జరగడంతో యుద్ధంలో క్షతగాత్రులకు, సైనికులకు వైద్య సేవలు అందించారు. ఐదేళ్ల మిలటరీ సర్వీసుతో డాక్టర్ మిలటరీ రాజుగా పేరుపొందారు.

అనంతరం తణుకు నరేంద్ర కూడలి సమీపంలో తన తండ్రి ఇచ్చిన భవనంలో శ్రీ సత్యనారాయణ నర్సింగ్ హోమ్ ఏర్పాటుచేసి ఎటువంటి రుసుము లేకుండా పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.

ప్రైవేట్ వైద్యంలో కూడా ఎటువంటి ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించడం పేదల వైద్యుడు మన మిలిటరీ రాజు అంటూ సోషల్ మీడియాలో సైతం వైద్యుడు సేవలు వైరల్ అవుతున్నాయి.

తన 78 ఏళ్ల వయసులో కూడా పేదలకు సేవ చేయాలనే తపనతో వైద్యం అందిస్తున్నానని యువత కూడా సమాజానికి కొంత సేవ చేయాలని డాక్టర్ సత్యనారాయణ రాజు కోరారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story