Nidadavole: నిడదవోలు ఆస్పత్రిలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ!
Nidadavole: నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని రాత్రి వేళ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వైద్యులకు హెచ్చరిక.
Nidadavole: నిడదవోలు ఆస్పత్రిలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ!
Nidadavole: స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో, పత్రికల్లో నిడదవోలు ప్రభుత్వాసుపత్రి సేవలపై వస్తున్న వార్తలపై మంత్రి కందుల దుర్గేష్ స్పందన. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నిడదవోలుకు పయనం..రాత్రి 9 గంటలకు నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..ఎమర్జెన్సీ వార్డుల్లో స్వయంగా పరిశీలన..వైద్యసేవలపై ఆరా.. వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం.
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..నిడదవోలు ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బందికి మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక. రాత్రి వేళల్లో ఇద్దరు డాక్టర్లు తప్పనిసరిగా ఉండాలని మంత్రి దుర్గేష్ ఆదేశం. ఆస్పత్రిపై వైద్యపరమైన ఫిర్యాదులు పునరావృతం కాకూడదని హెచ్చరిక.
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని వెల్లడి. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి దుర్గేష్ హామీ. మంత్రి కందుల దుర్గేష్ చొరవపై హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు, రోగులు. నిడదవోలు నియోజకవర్గంపై పక్కా నిఘా..ప్రజా సమస్యల పరిష్కారంలో నో కాంప్రమైజ్..రాత్రైనా పగలైనా సమస్య తెలిసిన మరుక్షణమే ఆసుపత్రి బాట పట్టిన మంత్రి కందుల దుర్గేష్.




