Tanuku: తణుకులో కలకలం.. బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి?

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘోరం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Jun 2026 3:53 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో కలకలం.. బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి?

తణుకు: తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీకి చెందిన ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై ఓ యువకుడు చాకుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గెడ్డం జాషువ (22) అనే యువకుడు గత కొద్ది రోజులుగా బాలికను వెంటపడి వేధిస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు బాలికపై చాకుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అయితే బాలిక ధైర్యంగా ప్రతిఘటించడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన బాలికను వెంటనే తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story