Tanuku: తణుకులో రూ.7 కోట్లతో 4 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల శంకుస్థాపన!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రూ.7 కోట్లతో 4 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 15 Sept 2026 12:22 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో రూ.7 కోట్లతో 4 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల శంకుస్థాపన!

Tanuku: తణుకు పట్టణ ప్రజలకు గోదావరి జలాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించే దిశగా తణుకు పట్టణంలో .రూ.7 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నాలుగు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి మంగళవారం అయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. 2027 నాటికి ప్రతి ఇంటికీ గోదావరి జలాలు అందిస్తామన్నారు.

ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 135 లీటర్ల రక్షిత తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. తణుకు పట్టణానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రాంకుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెదేపా పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, యువత అధ్యక్షుడు ఒంటెద్దు రాజా, నాయకులు తాతపూడి మారుతీరావు, ఊట రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)