Tanuku: తణుకులో అర్హులందరికీ పింఛన్లు అందజేస్తాం!

Tanuku: తణుకులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 1 Oct 2026 12:31 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో అర్హులందరికీ పింఛన్లు అందజేస్తాం!

Tanuku: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు పురపాలక సంఘ పరిధి 32వ వార్డులో వృద్ధులకు బుధవారం ఆయన పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, ఇతర కేటగిరీల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అందజేస్తున్నామని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని తప్పుడు ప్రచారం చేశారని

తొలిరోజే 99% పెన్షన్లు పూర్తి చేసామని వెల్లడించారు. తణుకు నియోజవర్గంలో రూ.15.16 కోట్ల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)