Unguturu: ఉంగుటూరు పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్: ఎమ్మెల్యే ధర్మరాజు
Unguturu: ఉంగుటూరు పాఠశాలలో 'పేరెంట్స్ మీటింగ్'లో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. విద్యార్థుల చదువుకు 'తల్లికి వందనం' భరోసానిస్తుందని పేర్కొన్నారు.
Unguturu: ఉంగుటూరు పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్: ఎమ్మెల్యే ధర్మరాజు
ఉంగుటూరు: జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన "మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ 3.1" కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు..
- విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది... 'తల్లికి వందనం'తో ప్రతి విద్యార్థి చదువుకు ఆర్థిక భరోసాన్నా ఎమ్మెల్యే గారు..
ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన "మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ 3.1" కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల పురోగతి, విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించి, నాణ్యమైన విద్య అందించడంలో అందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, ప్రవర్తన, అభ్యాస ఫలితాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, వసతులు, విద్యా వాతావరణంపై ఎమ్మెల్యే గారు ఆరా తీసి, అవసరమైన అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నేతృత్వంలో సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు, మౌలిక వసతులు, కొత్త పాఠశాల భవనాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది కూడా 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసి, ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఈ పథకం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, మండల, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




