Rampachodavaram: ఘనంగా రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం

Rampachodavaram: రంపచోడవరంలో రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 18 Jun 2026 3:57 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: ఘనంగా రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం

రంపచోడవరం: ఘనంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమం నిర్వహణ.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జి రెడ్డి, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ను వారు సందర్శించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

గత రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు వంటి రంగాల్లో అమలు చేసిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకోగా, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story