Rampachodavaram: దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ.. పూజలు చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి
Rampachodavaram: రంపచోడవరంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే శిరీషాదేవి.
Rampachodavaram: దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ.. పూజలు చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి
రంపచోడవరం: సకల అపజయాల నుండి విజయాలు అనుగ్రహించే దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరంలో గురువారం దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమెకు ఆలయ పూజారులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకల దేవతల శక్తులు ఏకమైన దేవి మాత దుర్గామాత అని పేర్కొన్నారు. దుర్గా మాత దీవెనలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు ఆమెకు ప్రత్యేక వేద ఆశీర్వచనాలు అందించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా బాపన్నదొర అనే బాబీ, సీతపల్లి గడి బాపనమ్మ తల్లి దేవస్థానం సభ్యులు సిద్ధా వెంకన్న దొర, జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, కె.బాలకృష్ణ, ఎస్.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.




