Gurtedu: ప్రజల ముంగిటికే పాలన గుర్తేడులో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి!

Gurtedu: గుర్తేడులో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో 'ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు' కార్యక్రమం.

PRASANNA, RAMACHANDRAPURAM
Updated on: 27 Jun 2026 8:59 PM IST
Gurtedu
X

Gurtedu: ప్రజల ముంగిటికే పాలన గుర్తేడులో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి!

గుర్తేడు: ప్రజా సమస్యల పరిష్కారానికై అధికారులే మీముందుకు వచ్చి సమస్యలు తీర్చే క్రమంలో కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. గుర్తేడు మండలం కేంద్రంలో శనివారం ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ లకు గిరిజనులు సంప్రదాయ బద్దంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతీ నెలా నియోజక వర్గంలో నాలుగు పర్యటనలు చేసే ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

క్షేత్ర స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికై దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పారదర్శకంగా ప్రతీ సోమవారం అధికార యంత్రాంగం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ నిర్వహణ చేస్తున్నామన్నారు. తద్వారా అనేక సమస్యలు పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఇంకా గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యలు అంటే దూర భారం, అవగాహన లేమి, అధికారుల ముందుకు రాలేని పరిస్థితులు ఇలా మన్యంలో నెలకొన్నా యన్నారు. వీటిని అధిగమించాలంటే పాలకులు, అధికారులు నేరుగా మీ గ్రామానికే వచ్చి మీ సమస్యలు తీర్చే సువర్ణ అవకాశం కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


దీనిలో భాగంగా గ్రామ స్థాయి అధికారి నుండి జిల్లా స్థాయి అధికారి వరకూ మీ ముంగిటికే తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు ప్రాముఖ్యంగా బొడ్లంక గ్రామంలో పెళ్ళి కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరారు. ఉప్పరిగోతుల గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయాలని కోరారు. నూతనంగా మండలం ఏర్పాటు చేసినప్పటికీ (నెట్ వర్క్) అంతర్జాల సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎక్కువగా మౌళిక సదుపాయాల కల్పనలు కోసం పలు వినతులు రాగా స్పందించిన ఆమె, అధికార యంత్రాంగం త్వరలో పూర్తి చేసేలా చూస్తామని హమీ ఇచ్చారు.

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

విద్యార్థులకు మంచిగా అర్థమయ్యే బోధన చేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. గుర్తేడు లో శనివారం పర్యటించిన ఆమె స్థానిక ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పనితీరుపై ఆరా తీశారు.విద్యార్ధులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని వసతులు విద్యార్ధులకు అందిస్తున్నారా లేదా అనే విషయంపై పాఠశాల సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.

విద్యార్ధుల సామర్ధ్యాలను పరిశీలించారు. వారితో కలసి భోజనం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనతో చెప్పాలని సూచించారు. సిబ్బంది కూడా వారి యొక్క కష్టాలు ఇబ్బందులు ఉంటే నేరుగా తనతో చెప్పాలని పేర్కొన్నారు. అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చూస్తానని హమీ ఇచ్చారు.

అలాగే స్థానిక ఆసుపత్రిలో రోగులతో మాట్లాడిన అక్కడ అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సకాలంలో ఉంటున్నారా లేరా సక్రమంగా చూస్తున్నారా లేరా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత ఉంటే తనతో చెప్పాలని సూచించారు. అంబులెన్స్ సేవలపై అడిగి సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టిలో పెట్టాలని కోరారు.

ఓటర్ జాబితాలో లోపాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ లో బూత్ ఇంచార్జీలు సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. గుర్తేడు లో శనివారం పర్యటించిన ఆమె స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి SIR ప్రోగ్రాం లో పాల్గొన్నారు.

బూత్, యూనిట్, క్లస్టర్ ఇంచార్జీలు ఓటర్ జాబితాలలో ఉన్న మరణాలు, డబల్ ఎంట్రీలు, తప్పులుపై సమగ్రంగా పరిశీలించాలన్నారు. పూర్వం ఏయే బూత్ లలో ఓటు ఉందో ప్రస్తుతం ఏ బూత్ లలో ఓట్లు ఉన్నాయో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. పరిశీలన ప్రక్రియలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టిలో పెడితే పరిష్కార చర్యలు చేపడతానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కొత్తమాసు దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, DRDA PD రత్నాకర్,గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ శ్రీనివాస్ రావు, డిప్యూటీ డైరెక్టర్ రుక్మంగడయ్య, తహసీల్దార్ వేణుగోపాల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాపన్నదొర, APM ఆదినారాయణ, తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు , మాజీ సర్పంచ్ గొర్లె దుష్యంతుడు, యూనిట్ ఇంచార్జి కోండ్ల శివ శంకర్ రెడ్డి, బూత్ ఇంచార్జీలు వంతల రామ్మూర్తి, గొర్లె గుణశేఖర్, సీనియర్ నాయకులు AMC డైరెక్టర్ పసుపులేటి రాంబాబు, గొర్లె భూపేంద్రం, మాజీ ఉప సర్పంచ్ K. దేవిరెడ్డి, తురక యువకుమార్ తదితరులు పాల్గొన్నారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story