Rampachodavaram: ఓటర్ల పరిశీలనపై ఎమ్మెల్యే శిరీషాదేవి సమీక్ష!
Rampachodavaram:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ లో బూత్ ఇన్‌ఛార్జీలు సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీచైర్‌పర్సన్
Rampachodavaram: ఓటర్ల పరిశీలనపై ఎమ్మెల్యే శిరీషాదేవి సమీక్ష!
రంపచోడవరం: ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ లో బూత్ ఇంచార్జీలు సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.
గుర్తేడు లో శనివారం పర్యటించిన ఆమె స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి SIR ప్రోగ్రాం లో పాల్గొన్నారు. బూత్, యూనిట్, క్లస్టర్ ఇంచార్జీలు ఓటర్ జాబితాలలో ఉన్న మరణాలు, డబల్ ఎంట్రీలు, తప్పులుపై సమగ్రంగా పరిశీలించాలన్నారు.
పూర్వం ఏయే బూత్ లలో ఓటు ఉందో ప్రస్తుతం ఏ బూత్ లలో ఓట్లు ఉన్నాయో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. పరిశీలన ప్రక్రియలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టిలో పెడితే పరిష్కార చర్యలు చేపడతానని పేర్కొన్నారు
Next Story




