Penugonda: పెనుగొండలో ఘనంగా ‘ఇంటింటికీ మన పితాని’ కార్యక్రమం!
Penugonda: పెనుగొండలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ‘ఇంటింటికీ మన పితాని’ చేపట్టారు. చంద్రబాబు అరెస్టుపై నిజమే గెలిచిందని, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.
Penugonda: పెనుగొండలో ఘనంగా ‘ఇంటింటికీ మన పితాని’ కార్యక్రమం!
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవర్గంలోని పెనుగొండ గ్రామంలో బుధవారం ఇంటింటికిమన పీతాని కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు పేర్తాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో చివరకు నిజమే గెలిచిందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్‌లో ‘నిజం గెలిచింది’ కార్యక్రమంనిర్వహించనున్నట్లు తెలిపారు.మరోవైపు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. టీడీపీ శ్రేణులు పెనుగొండ మండలంరామచంద్రరావు.
పేట, చాకలిపేట ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలుఅందుతున్నాయా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందిస్తున్నామని.. కొత్తగా అర్హత పొందిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పార్టీ, ఓటు చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమం అందిస్తున్నామని స్పష్టం చేశారు. పెనుగొండ లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఏఎంసీ చైర్మన్ బడేటి బ్రహ్మాజీ, పెనుగొండ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ నక్క వ్యాద వ్యాసా శాస్త్రి, మాజీ సర్పంచ్ నక్క శ్యామల సోని శాస్త్రి, టౌన్ టిడిపి అధ్యక్షులు రొక్కాల సురేష్, టిడిపి నాయకులు మండ ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు గుత్తుల లోకేష్, మహిళా కార్యకర్తలు టిడిపి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




