Penugonda: పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావుకు మద్దతు!
Penugonda: పెనుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావును ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు శనివారం బలపరిచారు.
Penugonda: పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావుకు మద్దతు!
పెనుగొండ: పెనుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావును ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు కూటమి నాయకులు బలపరిచారు. ఆయన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కుడిపూడి శ్రీనివాసరావు గతంలో ఐరన్ యూనియన్ అధ్యక్షుడిగా, పెనుగొండ సామాజిక ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ గా , ఎస్పీకేపీ ప్రభుత్వ కళాశాల పాలకమండలి సభ్యుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా శ్రీనివాసరావును సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినట్లు తెలిపారు. పెనుగొండ గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




