Polavaram: పోలవరం పరివాహక ప్రాంతంలో ఎంపీ పురందరేశ్వరి పర్యటన
Polavaram: రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పోలవరం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు.
Polavaram: పోలవరం పరివాహక ప్రాంతంలో ఎంపీ పురందరేశ్వరి పర్యటన
Polavaram: ఆదివారం ఉదయం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి పోలవరం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాన్ని పర్యటించారు పురుషోత్త పట్నం నుండి గండి పోచమ్మ ఆలయం వరకు పర్యటన కొనసాగింది పోచమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎంపీ పురందరేశ్వరి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం వలన అమ్మవారి ఆలయము ముంపుకు గురవుతుందని, వెంటనే చర్యలు తీసు కోకపోతే ఆలయం కనుమరుగవుతుందని కొన్ని పత్రికలలో వచ్చిన కథనాలపై స్థానిక భక్తులు ఆందోళన వ్యక్తం చేయగా దీనిపై ఆమె స్పందిస్తూ ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పు అయినటువంటి పోచమ్మ అమ్మవారి ఆలయ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చించి రక్షణ గోడ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ మూలవిరాట్ ఏమాత్రం చెక్కుచెదరకూడదని ఆలయానికి రక్షణ గోడను నిర్మించాలని నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలైనటువంటి పురాతన ఆలయాలను రక్షించుకోవాలని అధికారులను ఎంపీ పురందరేశ్వరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి, మట్టా మంగరాజు, కోన వెంకట సురేష్, అడపాదొరబాబు తదితరులు పాల్గొన్నారు




