Narasapuram: సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగుతోంది.
Narasapuram: సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగుతోంది. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో, జడ్పీటీసీ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులు సూచించిన కేంద్రాల్లో తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా నరసాపురం డి.ఎస్.పి ఎం సుధాకర్ రావు, టౌన్ సిఐ ఆకుల రఘు, రూరల్ ఎస్ఐ శారదా సతీష్ పోలీసు సిబ్బందికి విధులపై దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.




