Palakollu: పాలకొల్లు నియోజకవర్గంలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల పర్వం!
Palakollu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ. పోలీసు బందోబస్తు మధ్య తొలిరోజు నామినేషన్ల దాఖలు.
Palakollu: పాలకొల్లు నియోజకవర్గంలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల పర్వం!
Palakollu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం లో పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండల పరిషత్ కార్యాలయాలలో స్థానిక ఎంపీటీసీల నామినేషన్ ల ప్రక్రియ ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది. తొలి రోజు కావడంతో కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొనగా కొందరు అభ్యర్థులు రేపు మంచి రోజు అనీ భావించి రేపటి రోజు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పాలకొల్లు మండలం అగర్రు గ్రామానికి చెందిన విల్లూరి రత్నారాజు, శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన ర్యాలీ వెంకట సుబ్బారావు, తిల్లపూడి గ్రామానికి చెందిన విప్పర్తి శేషకుమారి నామినేషన్ దాఖలు చేశారు.
యలమంచిలి మండలం లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా మేడపాడుకు చెందిన వాకాని వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
పోడూరు మండలం లో పండితవిల్లూరు (టిడిపి) ఎంపీటీసీ అభ్యర్థిగా పుట్ల
సుబ్రహ్మణ్యం నామినేషన్ దాఖలు చేయగా
గుమ్మలూరు నుండి ఎంపీటీసీ 1 (జనసేన) అభ్యర్థి రావి హరీష్, ఎంపీటీసీ 2.(టిడిపి)అభ్యర్థిగా, వేండ్ర ధనలక్ష్మి, వేడంగి ఎంపీటీసీ 1 (జనసేన) అభ్యర్థిగా యడ్ల మహాలక్ష్మి, పెనుమదం ఎంపీటీసీ అభ్యర్థిగా చోరపల్లి అరుణాదేవి( జనసేన) నామినేషన్ దాఖలు కాగా పోడూరు మండలం లో 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏ విధమైన అవ్వాంచనీయ సంఘటనలు జరగకుండా వైద్య సిబ్బందినీ మరియు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.




