Narsapuram: నరసాపురం డివిజన్లో ప్రశాంతంగా నామినేషన్లు!
Narsapuram: నరసాపురం డివిజన్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు.
Narsapuram: నరసాపురం డివిజన్లో ప్రశాంతంగా నామినేషన్లు!
Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్ రావు వెల్లడించారు. డివిజన్ పరిధిలోని మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట మండలాల్లో గత రెండు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. మూడో రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డీఎస్పీ ఎం. సుధాకర్ రావు స్పష్టం చేశారు.




