Achanta: ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం

Achanta: ఎమ్మార్పీెస్ (MRPS) 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 8 July 2026 7:46 AM IST
Achanta
X

Achanta: ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం

Achanta: 32 సంవత్సరాలు క్రితం ఎమ్మార్పీఎస్ ను స్థాపించి అణగారి నా పేదల కోసం వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శరత్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం 32వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ముందుగా తీన్మార్ వాయిద్యాలతో మండల కేంద్రంలో మంద కృష్ణ మాదిగ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగుల్కే కాకుండా అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలపై ముందుండే నాయకుడు మందకృష్ణ మాదిగని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు తొత్తరుముడి శ్రీనివాస్, పసల సత్యనారాయణ, కొండేటి ఆదినారాయణ, కొడమంచిలి ప్రభాకర్ రావు, బొంగా లీలా కృష్ణ, చదలవాడ భాస్కరరావు, చదలవాడ లాజర్, చదలవాడ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story