Eluru: వేలేరుపాడులో ఎమ్మార్పీఎస్ 'గో టు విలేజ్': విజయవంతం చేయండి!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ 'గో టు విలేజ్' కార్యక్రమం.
Eluru: వేలేరుపాడులో ఎమ్మార్పీఎస్ 'గో టు విలేజ్': విజయవంతం చేయండి!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం, ఎమ్మార్పీఎస్ గో టు విలేజ్ కార్యక్రమం మే 25 నుండి జూలై 5 వరకు 40 రోజులపాటు జరిగే కార్యక్రమాన్ని వేలేరుపాడు మండలంలో విజయవంతం చేయాలని మండల ఎంఆర్పిఎస్ నాయకులు తుంగ శ్రీనివాసు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు ముఖ్య కార్యకర్తలు నాయకులు హాజరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ ముఖ్య అతిధులు కూచిపూడి సత్యం మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు ఏలూరు ఇన్చార్జి ఇసంపల్లి సిద్దు మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి మురళీకృష్ణ మాదిగ రావడం జరుగుతుంది.
కావున వేలేరుపాడు మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రుద్రం కోట గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించడం జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ఎమ్మార్పీఎస్ నాయకులు తుంగ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.




