Narasapuram: నరసాపురంలో 110 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Narasapuram: నరసాపురం జనసేన క్యాంప్ కార్యాలయంలో 110 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 29 Sept 2026 6:30 PM IST
Narasapuram
X

Narasapuram: నరసాపురంలో 110 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం పట్టణంలోని జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయంలో 110 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది (CMRF)చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి, సీఎంఆర్ పథకం ద్వారా అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM