Narasapuram: నరసాపురంలో ₹50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Narasapuram: నరసాపురం జనసేన క్యాంప్ కార్యాలయంలో 110 మంది లబ్ధిదారులకు ₹50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పంపిణీ చేశారు.
Narasapuram: నరసాపురంలో ₹50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం పట్టణంలోని జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయంలో 110 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది (CMRF)చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ లబ్ధిదారులకు 50. లక్షలు రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి, సీఎంఆర్ పథకం ద్వారా అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




