Narsapuram: వశిష్ట గోదావరిలో కాలుష్యం మృత్యువాతపడుతున్న చేపలు!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి నదిలో ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల నీరు కలుషితమై చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారుల ఆందోళన.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 14 Oct 2026 2:12 PM IST
Narsapuram
X

Narsapuram: వశిష్ట గోదావరిలో కాలుష్యం మృత్యువాతపడుతున్న చేపలు!

Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని వశిష్ట గోదావరి నది కొన్ని ఫ్యాక్టరీల వ్యర్ధాలను వదలడంతో నీరు కలుషితమై మత్స్య సంపదను నాశనం చేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న మెరైన్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నదిలో కలవడం వల్ల గోదావరి నది జలాలు కలుషితమవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. కాలుష్యం ప్రభావంతో చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు మృత్యువాతపడి నది ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో గోదావరిపై ఆధారపడి జీవనం సాగించే తమ ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన చేపట్టారు నదిలో చేపల లభ్యత తగ్గడంతో తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వశిష్ట గోదావరి జలాల సమగ్రంగా పరిశీలన చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. నదిలో చేపలు చనిపోవడానికి గల కారణాలను గుర్తించి, కాలుష్యానికి కారణమవుతున్న వ్యర్థాల విడుదలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జలాలను, మత్స్య సంపదను పరిరక్షించి తమ జీవనోపాధిని కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM