Narsapuram: నరసాపురం ఫెర్రీలో వింత కుక్కకూ టికెట్.. భద్రత మాత్రం శూన్యం
Narsapuram: నరసాపురం-సఖినేటిపల్లి ఫెర్రీ రేవులో పెంపుడు కుక్కకు టికెట్ వసూలు. ప్రయాణికుల భద్రత, లైఫ్ జాకెట్లు పట్టించుకోని నిర్వాహకుల తీరుపై ప్రయాణికుడు బాలు మండిపాటు.
Narsapuram: నరసాపురం ఫెర్రీలో వింత కుక్కకూ టికెట్.. భద్రత మాత్రం శూన్యం
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదుకు చెందిన పోలిశెట్టి బాలు ఫెర్రీ రేవులో వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. నరసాపురం నుంచి సఖినేటిపల్లికి తన స్కూటీపై పెంపుడు కుక్కను తీసుకెళ్తుండగా, కుక్కకు కూడా టికెట్ తీసుకోవాలని నిర్వాహకులు డబ్బులు వసూలు చేయడంతో ఆశ్చర్యపోయారు.
అయితే ప్రయాణికుల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. సరిపడా లైఫ్ జాకెట్లు లేకపోవడం, బోట్ల ఫిట్‌నెస్ సరిగా లేక గోదావరి మధ్యలోనే పలుమార్లు నిలిచిపోవడం, బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. కుక్కకు టికెట్ వసూలు చేసే నిర్వాహకులు ముందుగా ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని బాలు డిమాండ్ చేశారు.




