Eluru: ఏలూరులో ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Eluru: ఏలూరు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఘనంగా 'జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం'. అటవీ అమరవీరులకు నివాళులర్పించిన డిఎఫ్‌ఓ పివి. సందీప్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 8:19 AM IST
Eluru
X

Eluru: ఏలూరులో ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Eluru: ప్రకృతి సంపదను,వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీ శాఖ సిబ్బంది చేసిన త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా అటవీ శాఖాధికారి పివి.సందీప్ రెడ్డి అన్నారు.ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో 'జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని'శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అటవీ అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ అటవీ అమరవీరుల ఆదర్శాలను, కర్తవ్య నిష్ఠను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం అమరవీరుల స్మారకార్థం అటవీ శాఖ సిబ్బందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

అదేవిధంగా,ఏలూరు డివిజన్ పరిధిలోని ఏడు అటవీ రేంజ్ లలో కూడా సంబంధిత రేంజ్ అధికారులు,సిబ్బంది అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి,ర్యాలీలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్