Tanuku: లోక్ అదాలత్‌లో 1,177 కేసులు రాజీ బాధితులకు రూ.74 లక్షలు మంజూరు!

Tanuku: తణుకు కోర్టు భవన సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 1,177 కేసులు రాజీ అయ్యాయి. బాధితులకు రూ.74.45 లక్షల పరిహారం ఇప్పించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 11 July 2026 8:00 PM IST
Tanuku
X

Tanuku: లోక్ అదాలత్‌లో 1,177 కేసులు రాజీ బాధితులకు రూ.74 లక్షలు మంజూరు!

తణుకు: జాతీయ లోక్ అదాలత్ ద్వారా విలువైన సమయం నగదు ఆదా చేసుకోవచ్చు అని నాలుగో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి అన్నారు. తణుకు కోర్టు భవన సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 1177 కేసులు రాజీ చేసి రూ.74,45,250 బాధితులకు ఇప్పించినట్లు ఆమె తెలిపారు.

వీటిలో 11 మోటర్ వాహన భీమ ప్రమాద కేసులకు సంబంధించి రూ.46,15,000 బీమా కంపెనీ నుంచి కక్షిదారులకు ఇప్పించినట్లు వెల్లడించారు. 10 సివిల్ కేసులకు గాను రూ. 22,38,000, 7 చెక్కు బౌన్స్ కేసులకు రూ. 5,92,250 చొప్పున కక్షిదారులకు ఇప్పించినట్లు వెల్లడించారు.

అదేవిధంగా 236 క్రిమినల్ కేసులు, 903 పెట్టి కేసులు, 10 టెలిఫోన్ బకాయి కేసులను రాజీ చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్య లత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్ ఆశీర్వాదం పాల్,

ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి స్వర్ణ, రెండో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కే కృష్ణవేణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంతి ప్రసాద్, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు పరిధిలోని పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారులు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story