Tanuku: తణుకు ఒకటో వార్డులో కూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభం!

Tanuku: తణుకు ఒకటో వార్డులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చైర్మన్ అభ్యర్థి బసవ రామకృష్ణ, గుబ్బల జ్ఞానేశ్‌ల ఎన్నికల ప్రచారం బుధవారం ప్రారంభమైంది.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 Nov 2026 7:00 PM IST
Tanuku
X

Tanuku: తణుకు ఒకటో వార్డులో కూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభం!

తణుకు: తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఒకటో వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బసవ రామకృష్ణ, ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుబ్బల జ్ఞానేశ్ తో కలిసి ప్రచారం చేపట్టారు.

గత రెండున్నర సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.తణుకు పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు, మద్దతు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)