Penumantra: పేదింటి ప్రతిభకు గుర్తింపు.. ఎంబీబీఎస్ సాధించిన అనూరాధకు సన్మానం!

Penumantra: పెనుమంట్ర మండలం మార్టేరులో నీట్‌లో ప్రతిభ చూపి ఎంబీబీఎస్ సీటు సాధించిన సిర్రా అనూరాధ, ఆమె తల్లిదండ్రులను పీహెచ్‌సీలో ఘనంగా సత్కరించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 10 Sept 2026 11:09 PM IST
Penumantra
X

Penumantra: పేదింటి ప్రతిభకు గుర్తింపు.. ఎంబీబీఎస్ సాధించిన అనూరాధకు సన్మానం!

పెనుమంట్ర: పేదరికాన్ని అధిగమించి పట్టుదలతో చదివి నీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించిన సిర్రా అనూరాధకు మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘన సత్కారం లభించింది. అనూరాధ ప్రతిభను అభినందిస్తూ పీహెచ్‌సీ మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌, పారిశ్రామికవేత్త కర్రి అచ్యుత రామారెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెనుమంట్ర తహసీల్దార్‌ టి. రాజారాజేశ్వరి అనూరాధను అభినందించారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. అనూరాధ సాధించిన విజయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కర్రి అచ్యుత రామారెడ్డి మాట్లాడుతూ.. అనూరాధ కష్టపడి చదివి సాధించిన విజయం ఎంతో అభినందనీయమన్నారు. ఆమె భవిష్యత్తులో వైద్యురాలిగా ఉన్నతంగా రాణించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

అనూరాధ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులను కూడా గ్రామంలోని కూటమి ప్రముఖ నాయకులు, వైద్యులు, పీహెచ్‌సీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. తమ కుమార్తెను ప్రోత్సహించి వైద్య విద్య వైపు నడిపించిన తల్లిదండ్రుల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా అనూరాధ కుటుంబ సభ్యులు, నాయకులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story