Tanuku: తణుకులో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Tanuku: తణుకులో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి!
తణుకు: నేటి యువత దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ 20 వార్డు యూనిట్ ఇన్చార్జి తాత పూడి మారుతీరావు అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ హింద్ పౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి సందర్భంగా తణుకు నేతాజి సుభాష్ చంద్ర బోస్ వీధిలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ స్వాతంత్ర్య పోరాటం వల్లే మనం స్వేచ్చ గా ఉన్నామని, వారి సేవలు మరువలేనివన్నారు.
నేటి యువత నేతాజీ స్ఫూర్తి తో భారత దేశ అభివృద్ధి కోసం కృషి చెయ్యాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కోశాధికారి గమిని రామచంద్రరావు, విత్తనాల సాయి, జడ్డు హరి, త్రాసుల నాని, కలగర శేషగిరి పాల్గొన్నారు.
Next Story




